శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నెల రోజులే గడువుండటం వల్ల వేడుకల ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏప్రిల్ 6న అంకురార్పణతో ఉత్సవాలు మొదలవనున్నాయి. ఏప్రిల్ 14న రామయ్య కల్యాణం, 15న పట్టాభిషేకం జరుగనుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు.
రూ.1.5 కోట్లు ఖర్చు
స్వామివారి కల్యాణానికి సుమారు రూ.1.5 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో రమేశ్‌బాబు తెలిపారు. విద్యుత్‌దీపాల అలంకరణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ముఖ్య కూడలిలో తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.