వలస కూలీలను అడ్డుకున్న ఏపీ అధికారులు
వలస కూలీలు వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించంటం వల్ల ఆంధ్రప్రాంతానికి చెందిన 200 మంది రాష్ట్రం నుంచి స్వగ్రామాలకు బయలుదేరారు. కానీ వారిని అశ్వరావుపేట సరిహద్దులో గల అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద ఏపీ అధికారులు అడ్డుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఆంధ్ర ప్రాంతానికి చెందిన 200 మంది వలస కూలీలను ఏపీ అధికారులు అడ్డుకున్నారు. కూలీల్లో కొందరు నెలలు నిండిన గర్భిణులు కాగా మరికొందరికి చంటి బిడ్డలు ఉన్నారు. పిల్లాపాపలతో చెక్‌పోస్ట్ సమీపంలో చెట్ల కింద తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్లులేక ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. ఏపీ రాష్ట్రంలోకి రావటానికి వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవటం వల్ల వారిని అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. దీనికితోడు ఉన్నతాధికారుల నుంచి కూలీలను అనుమతించాలని ఆదేశాలు రాలేదని వారు వెల్లడించారు.