చీమ గుడ్డు కూర గురించి విన్నారా!
వేసవి వచ్చిందంటే చాలు భద్రాచలం అడవుల్లో గొత్తికోయలు ఎర్రచీమల గుడ్ల వేటలో నిమగ్నమవుతుంటారు. చీమలగుడ్లతో ఏం చేస్తారంటారా? వాటితో ఎంచక్కా రుచికరమైన కూర వండుకొని తింటారు.
చీమ గుడ్డు కూర గురించి విన్నారా!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అడవుల్లో నివసించే గొత్తిగోయలు ఎర్రచీమల గుడ్ల వేటకు పయనమయ్యారు. వేసవి ప్రారంభమైందంటే చాలు... మన్యం ఆదివాసీలకిదో ఆహారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మారుమూల ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కొండెవాయిలోని దట్టమైన అడవిలో పెద్దలు, పిల్లలు చెట్లపై ఉన్న ఎర్రచీమల కోసం వేట ప్రారంభించారు. వాటి గుడ్లు సేకరిస్తున్నారు. ఈ గుడ్లతో రుచికరమైన కూర వండుకొని తింటారు.