భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్వహించిన ఆదివాసీ మహిళా చైతన్య సదస్సులో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజనులంతా కలసికట్టుగా ఉండి, తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. డిసెంబర్లో దిల్లీలో జరిగే మహా సదస్సుకు గిరిజనులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గిరిజనులంతా కలిసికట్టుగా ఉండాలి: సోయం బాపూరావు - ఆదిలాబాద్ ఎంపీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు.
గిరిజనులంతా కలిసికట్టుగా ఉండాలి: సోయం బాపూరావు