ఏఐటీయూసీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా 'సేవ్ సింగరేణి' పేరుతో చేపట్టిన యాత్ర కొత్తగూడెం చేరుకుంది. గోలేటి నుంచి కొత్తగూడెం దాకా నిర్వహించ తలపెట్టిన యాత్ర గమ్యం చేరుకుంది. సింగరేణిని రక్షించండి అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అగ్రనాయకులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో ఏఐటీయూసీ 'సేవ్ సింగరేణి' యాత్ర - kothagudem news
సేవ్ సింగరేణి పేరుతో చేపట్టిన ఏఐటీయూసీ యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.
aituc save singareni rally reached to kothagudem
కొత్తగూడెం జీకే ఉపరితల గనిలో ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని మాజీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ వేడుకలో వాసిరెడ్డి సీతారామయ్య, గట్టయ్య, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.