తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రిలో ఘనంగా అగ్ని ప్రతిష్ఠ వేడుక - అగ్ని ప్రతిష్ఠ వేడుక

భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఆలయంలో అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్​ 2న కళ్యాణం, 3న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.

agni prathista celebrations in bhadrachalam
భద్రాద్రిలో ఘనంగా అగ్ని ప్రతిష్ఠ వేడుక

By

Published : Mar 31, 2020, 2:30 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇవాళ అగ్ని ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 8 వరకు శ్రీరామనవమి వసంత పక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రాయికి రాయికి నడుమ రాపిడి కలిగించి అగ్ని పుట్టించారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభం ఎదుట అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం గరుడ ప్రసాదాన్ని అర్చకులు అందించారు. ఏటా సంతానం లేని భక్తులకు గరుడ ప్రసాదాన్ని అందించేవారు. కానీ ఈసారి భక్తులను అనుమతించకపోవడం వల్ల ఆలయ అర్చకులు వేడుకలను ఏకాంతంగా నిర్వహించాారు. బుధవారం ఎదుర్కోళ్లు ఉత్సవం, ఏప్రిల్ 2న సీతారాముల కళ్యాణం, 3న మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు.

భద్రాద్రిలో ఘనంగా అగ్ని ప్రతిష్ఠ వేడుక

ఇదీ చూడండి:ఆ బయోపిక్​కు నో చెప్పిన బాలయ్య!

ABOUT THE AUTHOR

...view details