మావోయిస్టు దళ సభ్యుడు సోడి ఉంగ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు ఎస్పీ రమణా రెడ్డి తెలిపారు. ఆదివారం కొత్తగూడెంలోని ఓఎస్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉంగ లొంగిపోవడానికి గల కారణాలను రమణా రెడ్డి వెల్లడించారు.
జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు దళ సభ్యుడు - bhadradri kothagudem latest news
మావోయిస్టు దళ సభ్యుడు సోడి ఉంగ పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రజల్లో మావోయిస్టు సిద్ధాంతాలపై ఆదరణ లేకపోవడం వల్ల జన జీవన స్రవంతిలో కలిసి పోయేందుకు సోడి ఉంగ లొంగిపోయాడని అదనపు ఎస్పీ రమణా రెడ్డి తెలిపారు.
జనజీవన స్రవంతిలో కలిసి పోయిన మవో దళ సభ్యుడు
సుక్మా జిల్లా గట్టపాటకు చెందిన ఉంగ 2015లో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అప్పటి కిష్టారం ఏరియా ఎల్ఓఎస్ కమాండర్ సబిత సహకారంతో సీఎన్ఎం సభ్యుడిగా చేరాడని అదనపు ఎస్పీ తెలిపారు. మూడేళ్లు అక్కడ పనిచేసిన అనంతరం దళ సభ్యుడిగా కిష్టారం ఎస్జీఎస్కు బదిలీ అయ్యాడని... ప్రస్తుతం ప్రకాశ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల సిద్ధాంతాలపై ప్రజల్లో ఆదరణ లేకపోవడం వల్లనే ఉంగ లొంగిపోయాడని అదనపు ఎస్పీ రమణా రెడ్డి తెలిపారు.