భద్రాచలంలోని బ్రిడ్జి పాయింట్ చెక్‌పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న గంజాయిని పట్టణ ఎస్సై మహేష్ పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల ప్రకారం తనిఖీలు చేస్తుండగా... అనుమానాస్పదంగా కనిపించిన కారును సోదా చేయగా గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా భద్రాచలంలో పోలీసులు పట్టుకున్నారు.
తూర్పుగోదావరి టూ హైదరాబాద్ వయా భద్రాచలం.. - భారీగా పట్టుబడిన గంజాయి
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలం బ్రిడ్జ్ పాయింట్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా... కారులో తరలిస్తున్న 71 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
భద్రాచలంలో 71 కిలోల గంజాయి పట్టివేత
71 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 10 లక్షల 71 వేల రూపాయలు ఉంటుందని సీఐ వినోద్‌రెడ్డి తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న మిర్యాలగూడకు చెందిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి:రెండు కోట్లు చోరీ చేసిన దొంగల ముఠా అరెస్టు