తెలంగాణ

telangana

ETV Bharat / state

WRESTLING COMPETITION: హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు.. ఎక్కడో తెలుసా? - ఆదిలాబాద్ హోలీ వేడుకలు తాజా వార్తలు

WRESTLING COMPETITION: సాధారణంగా హోలీ పండుగ అంటే చిన్న పెద్ద బేధం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను నిర్వహిస్తారని తెలుసు. కానీ ఇక్కడ జరుపుకునే వేడుకను కళ్లార్పకుండా చూడాల్సిందే. అవేంటని అనుకుంటున్నారా? అవేనండి కుస్తీ పోటీలు.. ఈ సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్న ఆ ఊరు గురించి తెలుసుకుందామా...

WRESTLING COMPETITION
కుస్తీ పోటీలు

By

Published : Mar 18, 2022, 9:15 PM IST

WRESTLING COMPETITION: ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలో హొలీ పండుగను పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహించారు. దీనిని వారు గత 80 ఏళ్లనుంచి కొనసాగిస్తున్నారు.

ఇలా పరిచయమైంది

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశముఖ్ మామ పాల్సికర్ రంగారావు ఈ ప్రాంతానికి సంస్థానాధీశులుగా ఉండేవారు. 4 వేల ఎకరాల సాగు భూమి వీరి అధీనంలో ఉండేది. తరువాత సంస్థానాన్ని వదిలి రాజకీయంగా అడుగులు వేశారు. ఇలా ఆయన పాలనలో పరిచయమైన మహారాష్ట్ర సంప్రదాయమైన కుస్తీ పోటీలు నేటికి నిర్వహిస్తున్నారు.

తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వచ్చిన మల్లయోధులు ఈ కుస్తీలో పాల్గొన్నారు. గతంలో మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఒకరోజు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇందుకు గ్రామస్థుల నుంచి విరాళాలు సేకరించి ఆ డబ్బులతో పోటీలు ఏర్పాటు చేస్తున్నారు.

కుస్తీ పోటీల్లో పాల్గొన్న మల్లయోధులు

ఇదీ చదవండి: వీళ్ల హోలీ కొంచెం వెరైటీ... రంగులతో పాటు దెబ్బలూ తినాలి!

ABOUT THE AUTHOR

...view details