కంట తడిపెట్టిన మహిళా కండక్టర్లు - telangana rtc employees strike 2019
నిన్న ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న మహిళ కండక్టర్ నీరజ మృతికి ఆదిలాబాద్ ఆర్టీసీ ఐకాస నేతలు నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సుందరయ్య భవనం నుంచి బస్‌డిపో వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఆర్టీసీ సమ్మెపట్ల ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తుందంటూ ఖమ్మం జిల్లాలో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు నివాళిగా ఆదిలాబాద్‌లో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సుందరయ్య భవనం నుంచి ప్రారంభమైన ప్రదర్శన బస్‌డిపోవరకు కొనసాగింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... ప్రదర్శనలో పాల్గొన్న మహిళా కండక్టర్లు కంటతడిపెట్టడడం అందరిని కలిచివేసింది. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందనే ఆలోచనతోనే మహిళా కండక్టర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని... ఆ కుటుంబానికి దిక్కెవరని ప్రశ్నించారు. ప్రభుత్వ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు.