ఆర్టీసీ కార్మికుల సమ్మెతో... రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన
ఆర్టీసీ సమ్మె కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రవాణా వ్యవస్థలో ప్రతిష్ఠంభన నెలకొంది. రీజియన్ పరిధిలో 624 బస్సులు తిరగాల్సి ఉండగా... ఈరోజు ఆ సంఖ్య 150కి పడిపోయింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన నెలకొంది. ఈరోజు దసరా పండుగ పురస్కరించుకుని ఎలాంటి ధర్నా, రాస్తారోకో చేపట్టమని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేసినా... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డిపోల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ష మంచిర్యాలలోని ప్రధాన మార్గాల్లో అద్దె బస్సులు తిరిగినప్పటికీ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులకు బ్రేక్ పడింది. ఆర్టీసీ సమ్మెతో... జిల్లాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు...
- ఇదీ చూడండి : రెండురోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు