ఆదిలాబాద్‌లో వెయ్యి ఎకరాలతో నూతనంగా ఏర్పాటు చేసిన హరితవనంలో సాహస క్రీడల నిర్వహణను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. జంగల్ సఫారీ వాహనంలో దాదాపు ఏడు కిలోమీటర్ల మేర హరితవనాన్ని పరిశీలించారు. అనంతరం హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్‌లో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ... పులుల సంఖ్య ఎక్కువగా ఉందనీ.. తెలంగాణలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పటికీ...పులుల సంఖ్య లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వేయి ఎకరాలతో ఉన్న ఆదిలాబాద్ హరితవనాన్ని మరో రెండువేల ఎకరాలకు విస్తరింపజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
'రాష్ట్రంలో పులుల సంఖ్య తక్కువగా ఉంది' - పులులు
ఆదిలాబాద్‌లోని 'హరితవనం'లో ఏర్పాటు చేసిన సాహస క్రీడల నిర్వహణను ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
'రాష్ట్రంలో పులుల సంఖ్య తక్కువగా ఉంది'