తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యాటక ఔత్సాహికులకు.. స్కై సైకిలింగ్

రోప్ వే పర్యటన చూశాంకానీ.. ఇప్పడు రోప్ సైకిలింగ్ ను ఆదిలాబాద్ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేయనుంది. పర్యాటక ఔత్యాహికులను ఆకట్టుకునేలా 40 లక్షల వ్యయంతో ప్రారంభించనుంది.

By

Published : Jul 30, 2019, 1:09 PM IST

పర్యాటక ఔత్సాహికులకు.. స్కై సైకిలింగ్

ఆదిలాబాద్ మావలలోని అటవీ శాఖ వారి హరితవనంలో పర్యాటకుల సౌకర్యార్థం మరిన్ని అదనపు హంగులను అందుబాటులోకి తేస్తోంది. పర్యాటకుల సందర్శన మైమరిపించేలా ఉండటానికి ఔత్సాహికులైన వారి కోసం స్కైసైకిల్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. రూ.40 లక్షల అంచనా వ్యయంతో దాదాపు 40 అడుగుల ఎత్తులో ఇనుప తీగలను అమర్చి రెండు సైకిళ్లను ఏర్పాటు చేశారు. ఆకాశంలో ఈ తీగల సాయంతో సైకిల్‌పై ప్రయాణించటానికి ఏర్పాట్లు చేశారు. సైకిల్‌పై విహరించే పర్యాటకులు ప్రమాదాలకు గురి కాకుండా ఉండటానికి అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా అటవీ అధికారి బి.ప్రభాకర్‌ పేర్కొన్నారు. త్వరలో జిల్లా పాలనాధికారితో స్కైసైకిల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. చిన్నారులను ఆకర్షించటానికి ఇప్పటికే పలు రకాల ఊయలలు, ఆహ్లాదం కోసం పచ్చదనం, సమీపంలోని అటవీ అందాలను తిలకించటానికి సఫారీ వాహనాన్ని అందుబాటులో ఉంచింది.

ABOUT THE AUTHOR

...view details