తెలంగాణ

telangana

ETV Bharat / state

చదువులోనే కాదు కరాటేలోనూ సత్తా చాటుతున్న బాలికలు

సాధారణంగా పాఠశాల అంటే చదువు బోధిస్తారు. ఇక్కడ మాత్రం విద్యతో పాటు కరాటే కూడా నేర్పిస్తున్నారు. ఆపద సమయంలో బాలికలు తమను తాము ఎలా రక్షించుకోవాలో ఆపోసన పడుతున్నారు. కరాటే ప్రావీణ్యాన్ని పెంచుకుంటూ పథకాలు సాధిస్తున్నారు ఆదిలాబాద్​ ఇచ్చోడ కస్తూర్బా గాంధీ విద్యార్థినులు.

సాధన చేస్తూ

By

Published : Mar 23, 2019, 3:25 PM IST

Updated : Mar 23, 2019, 4:01 PM IST

కరాటేలో సత్తా చాటుతున్న బాలికలు
బాలికలకు తెలివితేటలే కాదు యుద్ధ విద్యలు కూడా అవసరమే. ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు ఆత్మ రక్షణ శక్తి ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడకస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు కరాటేలో ప్రావీణ్యం పొంది ప్రతిభనుచాటుతున్నారు.

4 రకాల అంశాలు

బోధనతో పాటు ప్రత్యేకంగా బాలికలు, మహిళలపై జరుగుతున్న వేధింపులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ సాహస విద్యను నేర్పిస్తున్నారు. కరాటేలో నిపుణుడైన రాజు 14 రకాల అంశాలను ఇక్కడ బోధిస్తున్నారు.

ప్రతిభపురస్కారాలు

ఇటీవల బెల్లంపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో తొమ్మిది మంది విద్యార్థినులు సత్తా చాటి ప్రతిభాపురస్కారాలను అందుకున్నారు. కరాటేతో ధైర్యసాహసాలతో పాటు ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొనే శక్తి వస్తుందని బాలికలు చెబుతున్నారు.

పిరమిడ్ కరాటే

కరాటేలో రకరకాల విన్యాసాలతో పాటుపిరమిడ్ కరాటేను నేర్చుకున్నారు. అన్ని రకాల అంశాలను అలవోకగా ప్రదర్శిస్తూ శత్రువును ఎలా ఎదుర్కోవాలో చూపిస్తున్నారు ఈ విద్యార్థినులు.

ఇవీ చూడండి:కేసీఆర్ బహిరంగ సభలు... కేటీఆర్​ రోడ్​ షోలు

Last Updated : Mar 23, 2019, 4:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details