ఆదిలాబాద్ జిల్లా బోథ్ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడిపై విద్యార్థిని తల్లిదండ్రులు దాడికి యత్నించారు. తమ కూతురును ఇన్‌ఛార్జి వార్డెన్ వసంతరావు లైంగికంగా వేధించాడంటూ వాగ్వాదానికి దిగారు. కొట్టేందుకు వెళ్లగా... పక్కనే ఉన్న ఉపాధ్యాయులు ఆపారు. ఒక్కసారి మా పాపని ముట్టుకుని చూడు... నీ అంతు చూస్తామంటూ విరుచుకుపడ్డారు. అనంతరం ఉపాధ్యాయుడు వసంతరావు బోథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకోవాలని కోరారు.
"ఆశ్రమ' ఉపాధ్యాయుడు నా బిడ్డను లైంగికంగా వేధిస్తున్నాడు" - ఆదిలాబాద్ జిల్లా బోథ్ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
రేయ్... ఒక్కసారి మా పాపని ముట్టుకొని చూడరా... నీ అంతు చూస్తానంటూ ఉపాధ్యాయుడిపై విరుచుకుపడింది ఓ తల్లి. అసలింతకీ ఏమైంది, ఎందుకామె ఆ ఉపాధ్యాయుడిపై విరుచుకుపడిందో తెలుసుకోవాలనుందా...
ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
"ఆశ్రమ' ఉపాధ్యాయుడు నా బిడ్డను లైంగికంగా వేధిస్తున్నాడు"
ఇవీ చూడండి: హాజీపూర్ కేసులో మరికొద్దిసేపట్లో 'తుది' వాదనలు