ఇచ్చోడ మార్కెట్ యార్డులో తడిసిన సోయా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో గత రెండు రోజులుగా కురిసిన తేలికపాటి వర్షాలతో రైతులు నష్టపోయారు. శుక్రవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకాలకు రైతులు తీసుకువచ్చిన సోయా పంట తడిసి పోయింది. రక్షణగా టార్పాలిన్లు కప్పినా.. నీరు చొచ్చుకొని వెళ్లినందున అవి తడిసాయి. యార్డులో రక్షణగా షెడ్ లేక పోవడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని అన్నదాతలు వాపోయారు. నీటిని తొలగించడానికి తంటాలు పడాల్సి వస్తోందని ఆరోపించారు. మార్కెట్ యార్డులో సొయా, పత్తి నిల్వలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని.. షెడ్లు వెంటనే నిర్మించాలని రైతులు కోరారు.