ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో శ్రీరామ నవమి పురస్కరించుకుని సీతారాములను పల్లకిపై ఊరేగించారు. పట్టణంలోని జైశ్రీరామ్ గోశాల, రామలక్ష్మణ ఆలయం నుంచి రాములవారి పల్లకి సేవ హనుమాన్ దీక్ష స్వాముల ఆధ్వర్యంలో గ్రామంలోని పురవీధుల గుండా సాగింది. దారి పొడవునా భక్తులు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రామ కీర్తనలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ ఊరేగించారు. శ్రీరామ నవమి వేడుకలకు ముందురోజు రఘుకుల నాథుడికి పల్లకిసేవ చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.
ఘనంగా సీతారాముల పల్లకి ఊరేగింపు
లక్ష్మణ సమేత జానకి రాముడు పుర వీధుల్లో పల్లకిపై ఊరేగాడు. వీధులన్నీ రామనామ పారాయణతో పులకించాయి. హనుమాన్ దీక్ష స్వాములు రామ కీర్తనలు ఆలపిస్తూ ఊరేగించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో... ఏటా శ్రీరామ నవమికి ముందురోజు స్వామి వారికి పల్లకి సేవ చేయడం ఇక్కడ ఆనవాయితీ.
పుర వీధుల్లో ఊరేగుతున్న స్వామివారు