రాష్ట్రంలోని బీఎస్-4 వాహనాలు రిజిస్ట్రేషన్ గడువు త్వరలోనే ముగియనుంది. ఆదిలాబాద్లో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల రవాణా శాఖాధికారి పుప్పాల శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. తాత్కాలిక పత్రాలతో ఉన్న వాహనాలను ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు రవాణాశాఖ అనుమతి ఇచ్చింది.
'బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే సీజ్'
రాష్ట్రంలో బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. రిజిస్ట్రేషన్ లేని వాహనాలను రవాణాశాఖ సీజ్ చేసే యోచనలో ఉందని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రవాణా శాఖాధికారి పుప్పాల శ్రీనివాస్ వెల్లడించారు.
'బీఎస్ 4 వాహనాల రిజిష్ట్రేషన్ చేసుకోకుంటే సీజ్'
అప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోనట్లయితే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తొలుత జరిమాన, ఆ తరువాత వాహనాలను సీజ్ చేయాలని భావిస్తోందని ఆయన వెల్లడించారు.
ఇవీచూడండి:'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'