ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ఘన్పూర్ అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.2.76 లక్షల విలువైన నిషేధిత పొగాకును పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర హిమాయత్‌నగర్ నుంచి యథేచ్ఛగా నిషేధిత తంబాకు, గుట్కా సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు.
అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద నిషేధిత గుట్కా స్వాధీనం
మహారాష్ట్ర నుంచి నిషేధిత గుట్కా సరఫరా అవుతుందన్న సమాచారంతో ఆదిలాబాద్ జిల్లా ఘన్పూర్ అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.2.76 లక్షల విలువైన గుట్కా లభ్యమైంది.
అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద నిషేధిత గుట్కా స్వాధీనం
సోదాల్లో భాగంగా ఓ వాహనంలో ప్యాలాల సంచుల మాటున నిషేధిత గుట్కా లభ్యమైంది. గుట్కా సంచులను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.