ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అర్థరాత్రి విద్యుత్ సరఫరా లేక అంధకారం అలుముకుంది. ఎస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట ఉన్న విద్యుత్ తీగలపై చెట్టుకొమ్మ విరిగిపడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా... అధికారులు విద్యుత్ సరఫరా నిలపివేశారు.
అర్థరాత్రి అంధకారం... విద్యుత్‌కు అంతరాయం - ఆదిలాబాద్ వార్తలు
చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ తీగలపై పడి మంటలు చెలరేగిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సమస్య పరిష్కరించడానికి ఆలస్యం కావడంతో రెండు గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అర్థరాత్రి అంధకారం
చీకట్లో చెట్టు కొమ్మలు తీయడం ఆలస్యం కావడంతో... సుమారు రెండు గంటల పాటు అంధకారం అలుముకుంది. ఎండాకాలం ఉక్కబోతను తట్టుకోలేకపోతున్న ప్రజలు... రాత్రి కరెంటు లేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఇదీ చూడండి:అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం... భారీగా ఆస్తి నష్టం