తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమం.. కాస్త వివాదం - adilabad

అదో ఉత్తమ ఆరోగ్య కేంద్రంగా గుర్తింపు సాధించింది. ఆ ఆస్పత్రి చుట్టు పక్కల వారంతా వైద్యం కోసం అక్కడికే వెళ్లేవారు. ఆర్నెళ్లుగా పరిస్థితి మారిపోయింది. కొత్తగా వచ్చిన వైద్యుడు సక్రమంగా విధులకు రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అతన్ని తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

ఉత్తమం కాస్త వివాదం

By

Published : Mar 3, 2019, 9:25 PM IST

ఒకప్పుడు రాష్ట్రంలోనే అదొక ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ప్రస్తుతం వివాదాలకు కేంద్రంగా తయారైంది. ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​ మండల ఆరోగ్య కేంద్రం వైద్యుడు సూరత్​ సరిగ్గా విధులకు హాజరుకావడం లేదంటూ కొన్నాళ్లుగా ఆందోళన చేశారు. పనిచేయని వైద్యుడు తమకు వద్దంటూ ఇం​ఛార్జీ తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు. వివాదం కాస్త కలెక్టర్​ వద్దకు చేరింది. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్​వో రాజీవ్​రాజ్​ను కలెక్టర్​ దివ్య దేవరాజన్​ ఆదేశించారు.
కలెక్టర్​ ఆదేశాలతో డీఎంహెచ్​వో ఆరోగ్య కేంద్రం ఆవరణలో వైద్యులు, స్థానికులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్​వో ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న సూరత్​ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహించిన స్థానికులు వైద్యునికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతన్ని విధులు నుంచి తప్పించాలని వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్​కు నివేదించి, తగిన చర్యలు తీసుకుంటామన్న డీఎంహెచ్​వో హామీతో ఆందోళన విరమించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విధులకు సక్రమంగా హాజరుకాని వైద్యుడు

ABOUT THE AUTHOR

...view details