తెలంగాణ

telangana

ETV Bharat / state

PERSON SUICIDE ATTEMPT: తన ఇంటిస్థలాన్ని కబ్జా చేశారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం - ఆదిలాబాద్ జిల్లా తాజా వార్తలు

PERSON SUICIDE ATTEMPT: ఆదిలాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పెట్రోల్ పోసుకుంటుండగా గమనించిన నేతలు అతన్ని నిలువరించారు.

యువకుడు  ఆత్మహత్యాయత్నం
యువకుడు ఆత్మహత్యాయత్నం

By

Published : May 16, 2022, 5:10 PM IST

PERSON SUICIDE ATTEMPT: ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రణదివేనగర్‌కు చెందిన సంతోష్‌ యాదవ్‌ పెట్రోల్ డబ్బాతో వచ్చాడు. తన మీద పోసుకునేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న తెరాస పట్టణాధ్యక్షుడు అజయ్‌, కౌన్సిలర్‌ చంద నర్సింగ్‌ గమనించి అడ్డుకున్నారు. బాధితుడిపై నీరు చల్లి, పెట్రోల్‌ డబ్బాను లాక్కొన్నారు.

తన ఇంటిస్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఈర్ల దయాకర్‌, నలగంటి నవీన్‌, లంక కార్తీక్‌ కలిసి కబ్జాచేశారని ఆరోపించాడు. కొంతమంది కార్యకర్తలు బినామీపత్రాలు, మున్సిపాలిటీ పన్ను పత్రాలు సృష్టించి పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని సంతోష్ పేర్కొన్నారు.

నా ఇంటిస్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఈర్ల దయాకర్‌, నలగంటి నవీన్‌, లంక కార్తీక్‌ కలిసి కబ్జాచేశారు. కొంత మంది బినామీపత్రాలు, మున్సిపాలిటీ పన్ను పత్రాలు సృష్టించి పార్టీని బద్నాం చెస్తున్నారు.-బాధిత యువకుడు

ఇదీ చదవండి:ఎడతెరిపిలేని వర్షం.. వాననీటిలో కొట్టుకుపోయిన ధాన్యం

'భారత్- నేపాల్ స్నేహం సమస్త మానవాళికి ప్రయోజనకరం'

ABOUT THE AUTHOR

...view details