ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్)లో విషాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లిలో భోజనం వికటించి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మరో 24 మంది అస్వస్థతకు గురయ్యారు. తొలుత వారందరిని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో ఏడాది వయసున్న సిడాం అయ్యు, ఆరేళ్ల చిన్నుబాయి, కొడప సుఫారిలు ఉన్నారు. మృతులంతా చిన్నారులే కావడంతో ఆసుపత్రిలో తల్లిదండ్రుల, బంధువుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలిసిన ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటన వివరాలపై ఆరాతీసి మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
వికటించిన పెళ్లి భోజనం... ముగ్గురు చిన్నారుల మృతి - kids
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్)లో విషాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లిలో భోజనం వికటించి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మరో 24 మంది అస్వస్థతకు గురయ్యారు.
వికటించిన పెళ్లి భోజనం... ముగ్గురు చిన్నారుల మృతి
ఇవీ చూడండి: ఇంటర్ ఫలితాలపై విచారణ 15కు వాయిదా