ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో వివిధ సర్వే నంబర్ల కింద ఉన్న ప్రభుత్వ భూములను ఇతరులకు అక్రమంగా కట్టబెట్టిన అధికార యంత్రాంగం వాటిని స్వాధీనం చేసుకునే చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ధారాదత్తం చేసిన 108 ఎకరాలకు సంబంధించిన పట్టాలను ఆన్‌లైన్‌లో రద్దు(అన్‌సైన్డ్) చేశారు. ఈ చర్యలతో సంబంధిత అక్రమార్కుల వద్ద ఉన్న పట్టాలు నిష్ప్రయోజనంగా మారనున్నాయి.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్.. ఆ పట్టాలు రద్దయ్యాయి.. - ఆదిలాబాద్లో భూ కుంభకోణం
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతరులకు కట్టబెట్టినట్లు ఈటీవీ భారత్లో వచ్చిన కథనాలకు స్పందన వచ్చింది. ఈనాడు - ఈటీవీ భారత్ కథనాలకు స్పందించిన జేసీ... ఆ పట్టాలను రద్దు చేయాలని ఆదేశించారు.
passbooks cancel
'పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...' శీర్షికతో ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి స్పందించిన జేసీ సంధ్యారాణి... ఆ పట్టాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఇంఛార్జీ వీఆర్వోలుగా ఉన్న వీఆర్‌ఏలను ఇప్పటికే బాధ్యతల నుంచి తప్పించారు. .
ఇదీ చూడండి: పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...