ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో రూ.40 లక్షల వ్యయంతో నాలుగు బహిరంగ వ్యాయామశాలలు నిర్మించారు. వీటిని మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్నతో ప్రారంభించారు.
'ఉల్లాసంగా ఉండాలంటే... వ్యాయామం చేయాలి' - ఎమ్మెల్యే జోగు రామన్న వార్తలు
ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన నాలుగు ఓపెన్ జిమ్‌లను స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి వ్యాయాయం చేస్తే వచ్చే ప్రయోజనాలు వివరించి... అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
'శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే... వ్యాయామం చేయాలి'
గాంధీపార్కులో మహిళల కోసం ప్రత్యేకంగా వ్యాయామశాలను ఏర్పాటు చేయగా... కొత్త హౌసింగ్‌బోర్డు కాలనీ, విద్యానగర్, జీఎస్ ఎస్టేట్‌లో సామూహిక వ్యాయామశాలలను ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్లు వ్యాయామం చేశారు. మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కసరత్తులు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇదీ చూడండి:ఈ సరస్సులో మునిగారో.. తేలేది శవంగానే!