తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీల జ్ఞాపకాలు @లండన్

'ఆదిలాబాద్ ఆదివాసుల జ్ఞాపకాలు అందిస్తున్న లండన్'...  ఏంటి చిత్రంగా ఉంది అనుకుంటున్నారా? ఎక్కడి ఆదిలాబాద్ ఎక్కడి లండన్ వీటి కలయిక ఏంటని బుర్రపట్టుకుంటున్నారా ? అయితే మీరు నాగోబా జాతరకు వెళ్లాల్సిందే.

By

Published : Feb 8, 2019, 3:46 PM IST

ఆదివాసీలు జ్ఞాపకాలను అందించిన ఆంగ్లేయుడు

ఆదివాసీలు జ్ఞాపకాలను అందించిన ఆంగ్లేయుడు
'ఆదిలాబాద్ ఆదివాసుల జ్ఞాపకాలు అందిస్తున్న లండన్'... ఏంటి చిత్రంగా ఉంది అనుకుంటున్నారా? ఎక్కడి ఆదిలాబాద్ ఎక్కడి లండన్ వీటి కలయిక ఏంటని బుర్రపట్టుకుంటున్నారా ? అయితే మీరు నాగోబా జాతరకు వెళ్లాల్సిందే. మెతుకు... బతుకుల మధ్య సాగిన జీవిత సంఘర్షణల పర్వం... పూర్వీకులు అనుభవాలు-జీవిత పాఠాలు అన్ని కళ్లకు కడతాయి.
కెమెరాలో చిత్రాలను బంధిస్తున్న ఈ ఆంగ్లేయుడి పేరు మైకల్ యోర్క్. లండన్​కు చెందిన ఈయన 40ఏళ్ల క్రితం ఆదిలాబాద్ అడవులకు వచ్చారు. 1976-78 మధ్యకాలంలో ఆసిఫాబాద్​లోని గిన్నెదరిలో ఉండి ఆదివాసీల జీవన విధానాన్ని నిశితంగా పరిశీలించారు. గిరిపుత్రుల జీవిత చిత్రాలను తన కెమెరాలో బంధించారు. ఆనాటి నాగరికతకు వారధిగా నిలిచిన మైకల్​ ఫోటోలు నాగోబా జాతరలో ప్రదర్శిస్తున్నారు.
ఆదివాసీల వస్త్రధారణ... పెళ్లిపేరంటం, గుస్సాడి నృత్యం, పంట రక్షణ, కుటుంబ వ్యవస్థ ఇలా అన్ని అంశాలపై ఎన్నో జ్ఞాపకాలను ఆదివాసీలకు అందించాడు. ఈ ప్రదర్శనను చూసి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులే కాదు ఆదివాసీలు మంత్రముగ్ధలయ్యారు. నేటి యువతను కూడా ఈ ఎగ్జిబిషన్ బాగా ఆకట్టుకుంటోంది.
నాగోబా జాతరలో తాను తీసిన చిత్రాలు ప్రదర్శిస్తున్నారని తెలిసి మైకల్ యోర్క్ తన భార్యతో లండన్ నుంచి కేస్లాపూర్ వచ్చారు. 40ఏళ్ల తరువాత మళ్లీ ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు.
పూర్వీకుల ఆనాటి బతుకు చిత్రాలు చూసి ఆదివాసీలు ద్విగ్నానికి లోనయ్యారు. ఇప్పుడు వస్త్రధారణలోనే మార్పు వచ్చిందని, పూర్తి మార్పు ఎప్పుడు వస్తుందోనని ఆవేదనకు లోనయ్యారు.
ఆదివాసీ పోరాట చరితకు కుమురం భీం దిక్సూచిగా నిలిస్తే... ఆయన తిరుగుబాటు పటిమపై అధ్యయానికి వచ్చిన ఓ ఆంగ్లేయుడు... ఆదివాసీ జీవన వైవిధ్యానికి సంబంధించిన ఫోటోలకు దిక్సూచిగా నిలవడం...యాదృశ్ఛికమైన అంశమే.

ABOUT THE AUTHOR

...view details