తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారం: బిల్వపత్రం మొక్కలు నాటిన ఎమ్మెల్యే రామన్న

పచ్చదనం పెంపు లక్ష్యంతో ప్రారంభించిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని ఉమామహేశ్వర ఆలయంలో బిల్వపత్రం మొక్కలను నాటారు.

mla jogu ramanna participated in haritha haram programe in adilabad
హరితహారం: బిల్వపత్రం మొక్కలు నాటిన ఎమ్మెల్యే రామన్న

By

Published : Jun 25, 2020, 1:23 PM IST

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్థానిక​ రవీంద్రనగర్​లోని ఉమామహేశ్వర ఆలయంలో డీఎఫ్​వో ప్రభాకర్​తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో బిల్వపత్రం మొక్కలను నాటారు.

ఆరో విడత హరితహారం నూతన అధ్యాయంగా మారనుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు.

హరితహారం: బిల్వపత్రం మొక్కలు నాటిన ఎమ్మెల్యే రామన్న

ఇదీచూడండి:ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేయాలి: హోంమంత్రి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details