ఆచార, సంప్రదాయాలకు గిరిజనులు ఇచ్చే ప్రాముఖ్యతకు నాగోబా జాతర అద్దం పడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర మరికొద్ది గంటల్లో మహాపూజతో ప్రారంభమవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నాగోబా జాతర ఆదిమ గిరిజనుల ప్రాచీన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సంప్రదాయాలకు విలువనిస్తూ అన్ని పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గొప్పగా నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందని గుర్తు చేశారు. కరోనా నేపథ్యంలో గిరిజన దర్బార్, క్రీడా పోటీలను రద్దు చేసినట్లు మెస్రం వంశీయులు ప్రకటించారని మంత్రి వెల్లడించారు.