నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను కాపాడాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. లేదంటే ఉద్యోగాలు పోతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లోనే పేర్కొన్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 182 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు.
'మొక్కలు సంరక్షించకపోతే పదవులు, ఉద్యోగాలు పోతాయ్'
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో 85 శాతం ఫలితాలను చూపించనట్లైతే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవి పోతుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. ఒప్పంద ప్రాతిపదికన ఉన్న గ్రామ కార్యదర్శుల పదవి పర్మినెంట్ కాదన్నారు. రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ శాఖల భూములను గుర్తించే ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. గత అనుభవాలను తెలుసుకుని ఆరోవిడత హరితహారంలో నాటిన మొక్కలను దాదాపుగా రక్షించుకుంటామంటున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో మా ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి.
'మొక్కలు సంరక్షించకుంటే ఉద్యోగాలు పోతాయ్'
ఆరోవిడత హరితహారంలో మరో 30 కోట్ల మొక్కలను నాటుతామన్నారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్య సమన్వయంతో అటవీభూమల రక్షణ జరుగుతుందన్నారు. పోడు వ్యవసాయంతో కొంత సమస్య ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు