తెలంగాణ

telangana

ETV Bharat / state

అదిలాబాద్​ నుంచి మిడతలు ప్రవేశించే అవకాశం - ఆదిలాబాద్​ జిల్లా వార్తలు

ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో మిడతల దండు పంటలు ఆగం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్ర మీదుగా మిడతల దండు తెలంగాణలోకి ప్రవేశించనుంది. మహారాష్ట్ర నుంచి మిడతలు తొలుత ఆదిలాబాద్​ జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్​ శ్రీదేవసేన జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు.

Loctus Will Be Attack On Telangana
అదిలాబాద్​ నుంచి మిడతలు ప్రవేశించే అవకాశం

By

Published : May 28, 2020, 1:59 PM IST

మహారాష్ట్ర నుంచి మిడతలు ఆదిలాబాద్​ జిల్లాలో ప్రవేశించే అవకాశముందని, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి మిడతల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్​ కలెక్టర్​ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, అగ్నిమాపక అధికారులు, శాస్త్రవేత్తలతో కలెక్టర్​ సమావేశమయ్యారు. మిడతల దండు ప్రవేశిస్తే తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

మిడతలు పంట నష్టం చేయకుండా అగ్నిమాపక సిబ్బంది రసాయనాలు పిచికారీ చేయాలని ఆదేశించారు. అధికారులు చెప్పిన రసాయనాలు చల్లి రైతులు పంటలు కాపాడుకోవాలని కలెక్టర్​ రైతులకూ సూచించారు. జిల్లాలో ఏ ప్రాంతంలో మిడతల వల్ల సమస్యలు వచ్చినా వెంటనే టోల్​ ఫ్రీ నెంబర్​ 18001203244 కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు పాలనాధికారి సంధ్యారాణి, వ్యవసాయ అధికారి ఆశా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మండుతున్న ఎండలు

ABOUT THE AUTHOR

...view details