విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాలని శ్రీ శ్రీ శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని బీర్సాయిపేటలోని జీయర్ గురుకుల పాఠశాలలో ఆచార్యుల నూతన వసతి గృహ భవనాన్ని ఆయన ప్రారంభించారు. స్వామీజీకి విద్యార్థులు, ఆచార్యులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.
'చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమే'
చదువుతోపాటు సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమని... చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని బీర్ సాయి పేటలోని జీయర్ గురుకుల పాఠశాల ఆచార్యుల వసతి గృహ నూతన భవనాన్ని ప్రారంభించారు.
'చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమే'
జీయర్ స్వామి గిరిజన విద్యార్థుల చదువుల కోసం అల్లంపల్లి, బీర్సాయిపేటలో గురుకుల పాఠశాలు ప్రారంభించారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.