తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులపై దాడి చేయటం సరికాదు: మంత్రి - ATTACK

అడవులను సంరక్షించుకునేందుకు అధికారులతో పాటు అందరూ కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. అధికారులపై దాడులు చేయటం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.

అధికారులపై దాడి చేయటం సరికాదు: మంత్రి

By

Published : Jul 1, 2019, 10:57 PM IST

ఆదిలాబాద్ జిల్లా కాగజ్​నగర్ మండలం సార్సాలలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఖండించారు. అధికారులపై దాడులు చేయటం సరైన విధానం కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఉట్నూరులో పర్యటించిన మంత్రి.... నూతనంగా నిర్మించిన ఎంపీడీవో భవనాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. అడవులను సంరక్షించేందుకు ఆ శాఖ అధికారులతో పాటు అందరం కృషి చేయాలని సూచించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే రేఖానాయక్​తో కలిసి మొక్కలు నాటారు.

అధికారులపై దాడి చేయటం సరికాదు: మంత్రి

ABOUT THE AUTHOR

...view details