తెలంగాణ

telangana

ETV Bharat / state

గూడేల్లో తాగునీటి కష్టాలు

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం పలు గిరిజన గ్రామాల్లోని ప్రజలు తాగునీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని పలు గ్రామాలకు ‘భగీరథ’ నీరు గత పది రోజుల నుంచి రాకపోవడంతో గ్రామాలకు దూరంగా ఉన్న వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీస్తున్నారు.

Indervelly people facing trouble for drinking water
గూడేల్లో తాగునీటి కష్టాలు

By

Published : May 1, 2020, 9:56 AM IST

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. భగీరథ నీరు రాకపోవడం వల్ల వడ్‌గాం పంచాయతీ పరిధిలోని జైత్రాంతండా వాసులు గ్రామానికి కి.మీ. దూరంలో చేతి పంపు వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు.

హర్కపూర్‌ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ గ్రామస్థులు గ్రామానికి దూరంగా ఉన్న బావి నుంచి తాగునీరు తెస్తున్నారు. ఈ గ్రామానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భగీరథ’ పైప్‌లైన్‌ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని గ్రామస్థులు తెలిపారు. సాలేగూడ గ్రామంలో సర్పంచి ట్యాంకర్‌ నీటిని తెప్పిస్తున్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details