తెలంగాణ

telangana

ETV Bharat / state

Food poisoning: రాత్రి విందు భోజనం చేశారు.. తెల్లారేసరికి ఆస్పత్రిలో చేరారు! - ఆదిలాబాద్‌ జిల్లా తాజా వార్తలు

అంతా కలిసి రాత్రి ఆనందంగా ఓ విందు భోజనంలో పాల్గొన్నారు. తిన్న ఆహారం వికటించి తెల్లారేసరికి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరి తరువాత ఒకరు దాదాపు 41 మంది ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

food poisoning
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత

By

Published : Jun 11, 2021, 10:02 PM IST

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తడి హత్నూరులో గురువారం రాత్రి ఓ ఇంట్లో బంధువులంతా ఆనందంగా గడిపారు. అందరూ కలిసి విందు భోజనం చేసి హాయిగా నిద్రించారు. కానీ... శుక్రవారం ఉదయం నిద్రలేచే సరికి కొంతమంది వాంతులు, విరోచనాలతో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే మండల కేంద్రంలోని ఆస్పత్రిలో చేర్పించారు. వారి తరువాత ఇంకొంత మంది అలా... సాయంత్రం వరకు దాదాపు 41 మంది ఆనారోగ్యం పాలయ్యారు.

విషయం తెలుసుకున్న ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అస్వస్థతకు గురైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఎలాంటి ప్రమాదం లేదని ఆయన తెలిపారు. అనారోగ్యానికి గురైనా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: KCR review: గ్రామ పంచాయతీలు, పురపాలికల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం కేసీఆర్​ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details