మానవత్వానికి ప్రాంతంతో సంబంధం ఉండదు. తరతమ భేదం ఉండదు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆదిలాబాద్ జిల్లా పిప్పరవాడ గ్రామస్థులు ఆపన్నహస్తం అందించారు. అటుకులు, పేలాలు, పల్లీలతో కూడిన అల్పాహారం అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నారు. మరోపక్క కృష్ణాజిల్లాకు చెందిన సోమ కంపెనీ డైరెక్టర్ మాగంటి మోహన్‌దాస్ ఆధ్వర్యంలో తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో నెల రోజులుగా క్రమం తప్పకుండా 200 మంది నిరుపేదలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు...
పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు
లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పర్వాడ గ్రామస్థులు పేదలకు అల్పాహారం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకున్నారు. మరోవైపు కృష్ణా జిల్లాకు చెందిన మాగంటి మోహన్ దాస్ ఆధ్వర్యంలో తెలంగాణ - మహారాష్ట్ర నెల రోజులుగా అన్నదానం చేస్తున్నారు.
పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు