ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, జలాశయాలు జలసిరిని సొంతం చేసుకున్నాయి. జనజీననం పూర్తిగా స్తంభించిపోయింది.
ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని ఉట్నూర్, జైనూర్, సిర్పూర్(యు) మండలాల్లో వంకతుమ్మ, చింతగూడ, కిషన్ నాయక్ తాండా వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా ఆ మండల కేంద్రంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించి పోయాయి.
ఆదిలాబాద్ గ్రామీణ మండలం బంగారుగూడ వాగు పొంగి పొర్లుతోంది. ఫలితంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల మధ్య ప్రధాన రహదారి మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి.
జైపూర్, వేమనపల్లి, బెజ్జూరు, దహేగాం మండలాల్లోని చిన్నచిన్న వాగులు పొంగిపొర్లడం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సింగరేణి ప్రాంతమైన బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ప్రాంతాల్లోని ఉపరితల గనుల్లో... బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ఇవీచూడండి:ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు