రైతు సమస్యలపై తెలంగాణ రైతాంగ సమితి 2వ రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 5, 6 తేదీల్లో జరిగే మహాసభల గోడ పత్రికను హైదరాబాద్లో ఆవిష్కరించారు.
రైతు మహాసభలు - గోడ పత్రిక
ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 5, 6 తేదీల్లో రైతు సమస్యలపై తెలంగాణ రైతాంగ సమితి మహాసభలను నిర్వహించనుంది. గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు.
మహాసభలు
రైతులకు గిట్టుబాటు ధర, రుణ విముక్తి బిల్లులను పార్లమెంటులో ఆమోదించాలని.... ఆదివాసి స్వయం పాలనను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అమలు కోసం పోరాడుతున్న రైతులను ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రస్తుతం కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలలో చర్చించి.. భవిష్యత్ కార్యచరణనను రూపొందిస్తామని తెలిపారు.