లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఊరుకునేది లేదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లక్షెట్టిపేట్లో రాయి సెంటర్ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. డిసెంబర్ 9న దిల్లీలో నిర్వహించే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్టీలకతీతంగా ఆదీవాసీ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యమానికి సహరించని వారిని జాతి ద్రోహులుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఆదివాసీల జోలికి వస్తే విప్లవమే: సోయం బాపూరావు - laksettipet
ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట్లో రాయి సెంటర్ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బూపూరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు.
ఆదివాసీల జోలికి వస్తే విప్లవమే: సోయం బాపూరావు