కరోనా నివారణలో అందరూ నిబంధనలు పాటిస్తూ... తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి ఛైర్మన్ లోక భూమారెడ్డి తెలిపారు. దీని కోసం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని గ్రామపంచాయతీ సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లను అందించారు.
'సామాజిక దూరం పాటించండి.. కరోనాను తరిమికొట్టండి' - తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి ఛైర్మన్ తాజా వార్తలు
కరోనా నివారణలో ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటిస్తూ... తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి ఛైర్మన్ లోక భూమారెడ్డి సూచించారు. కరోనాపై పోరాటం కోసం అదిలాబాద్ ఉట్నూర్‌లోని గ్రామపంచాయతీ సిబ్బందికి ఆయన శానిటైజర్లు, మాస్క్‌లను అందించారు.
'కరోనా నివారణకు అందరూ కృషి చేయాలి'
ప్రతి ఒక్కరు విధిగా సామాజిక దూరం పాటిస్తూ... మాస్క్‌లు ధరించాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దీనికి గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి :కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సోయం