లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ...కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది, ప్రజల పాత్ర అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా ఉప వైద్యాధికారి మనోహర్ పేర్కొన్నారు. ఉట్నూరు మండలం శంకర్ తండాలో థర్మల్ స్కానర్‌పై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం వైద్య సిబ్బందితో పాటు స్థానికులను థర్మల్ స్కానర్‌తో పరీక్షలు నిర్వహించారు.
'లాక్డౌన్ కాలంలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం' - district Deputy Superintendent Manohar tour
కరోనా వ్యాప్తి నివారణలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తల కృషి అభినందనీయమని జిల్లా ఉప వైద్యాధికారి మనోహర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శంకర్ తండాలో థర్మల్ స్కానర్‌పై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు.
'వైద్య సిబ్బంది సేవలు అభినందనీయం'
లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్నంత వరకు అనవసరంగా ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించారు. పరిసర ప్రాంతాలతో పాటు వ్యక్తిగత శుభ్రత అనివార్యమని తెలిపారు.