తెలంగాణ

telangana

ETV Bharat / state

డీసీపీ రక్షిత నేతృత్వంలో నిర్బంధ తనిఖీలు - ఏసీపీ గౌస్​ బాబా

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్​నగర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలను, 6ఆటోలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు.

డీసీపీ రక్షిత నేతృత్వంలో నిర్బంధ తనిఖీలు

By

Published : Sep 20, 2019, 11:52 AM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్​నగర్​ కాలనీలో ఇంటింటా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలను, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వీధీలోని పలు సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు డీసీపీ. వీలైనంత త్వరగా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని... బెల్టు షాప్​లను మూసేస్తామని హామీ ఇచ్చారు. మెుత్తం ఈ తనిఖీల్లో ఏసీపీ గౌస్​ బాబా, 55 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

డీసీపీ రక్షిత నేతృత్వంలో నిర్బంధ తనిఖీలు
ఇదీచూడండి: నగల కోసం హత్య చేశారు... కటకటాల పాలయ్యారు

ABOUT THE AUTHOR

...view details