కరోనా వ్యాధి తీవ్రత, లక్షణాలు, నివారణ చర్యలపై ఆదిలాబాద్ జిల్లా కోర్టులో అవగహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిణి, ఇతర జడ్జిలతో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.చందు అవగహన కల్పించారు. అప్రమత్తంగా ఉంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు.
జిల్లా కోర్టులో కరోనాపై అవగాహన కార్యక్రమం
కరోనా వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కోర్టులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిణి, ఇతర జడ్జిలతో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.చందు అవగాహన కల్పించారు.
జిల్లా కోర్టులో కరోనా అవగాహన కార్యక్రమం
అత్యవసర కేసుల విచారణను మినహాయిస్తే మిగతా కేసుల విచారణ ఈనెల 31 వరకు వాయిదా వేసినప్పటికీ... ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో సూచించారు. చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు వినియోగించటం వంటివి చేయాలని తెలిపారు.