ఆదిలాబాద్‌లోని చించెరువాడు సమీపంలోని ప్రసిద్ధ మారెమ్మ ఆలయ బోనాలకు కరోనా వ్యాధి ప్రతిబంధకంగా మారింది. ఏటా ఆలయ వార్షికోత్సవ సందర్భంగా అంగరంగ వైభవంగా వేసే బోనాలు ఈ సారి కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా కేవలం పూజలతోనే సరిపెట్టాల్సి వచ్చింది.
కరోనా ఎఫెక్ట్: నిరాడంబరంగా ఆదిలాబాద్ మారెమ్మ బోనాలు - latest news of adilabad
అంగరంగ వైభవంగా జరగాల్సిన ఆదిలాబాద్ మారెమ్మ దేవాలయ వార్షికోత్సవాలు కరోనా కారణంగా సాదాసీదాగా జరిగాయి. భక్తులు ఆలయానికి రావద్దనే నిబంధనల మేరకు దేవాలయ నిర్వాహకులే అమ్మవారికి సకల సపర్యలు చేశారు.
కరోనా ఎఫెక్ట్: నిరాడంబరంగా ఆదిలాబాద్ మారెమ్మ బోనాలు
కొంతమంది ఆలయ నిర్వాహకులు, మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ప్రజల ఆయురారోగ్యాలను కాపాడాలని వేడుకున్నారు.
ఇవీ చూడండి:హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?