ఆదిలాబాద్ జిల్లాలో కరోనా ఉద్ధృతి తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే వైరస్ సోకి ఇద్దరు మృత్యువాత పడగా.. తాజాగా మరో మరణం నమోదయింది. ఆదిలాబాద్ ఒకటో పట్టణ ఏఎస్సైగా పనిచేస్తున్న ఖానాపూర్ కాలనీకి చెందిన నజీబ్ మహ్మద్‌ఖాన్ అనారోగ్యంతో నిన్న రిమ్స్‌లో చేరారు. కరోనా లక్షణాలు కనిపించడం వల్ల వైద్య సిబ్బంది నమూనాలు సేకరించారు. ఉదయం ఆయన మృతిచెందగా.. కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా ఉద్ధృతి
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో వైరస్ సోకి ఇద్దరు మృత్యువాత పడగా.. తాజాగా మరో కరోనా మరణం నమోదయింది. జిల్లాలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండడం వల్ల జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో మూడుకు చేరిన కరోనా మరణాలు
కుటుంబీకులు తొలుత మృతదేహాన్ని తమకు ఇవ్వాలని పట్టుబట్టినా.. కరోనా నిర్ధారణతో వైద్యులు మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. గత వారం రోజులుగా జిల్లాలో కరోనా బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 44 కేసులు యాక్టివ్‌గా ఉండటం పట్టణాలకే పరిమితమైన కేసులు పల్లెల్లకు పాకుతుండటం ప్రజలను మరింత కలవరానికి గురిచేస్తోంది.
ఇవీ చూడండి: 'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'