ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మొక్రా(బి) గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ధ్రువపత్రాలు సరిగా లేని 33 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, ఒక జీపును స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో జిల్లా ఎస్పీ విష్ణువారియర్ పాల్గొన్నారు. నేరాలను అదుపు చేసేందుకు, ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డీఎస్పీ డేవిడ్ , ఎస్సై పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
'నేరాలను అదుపు చేయడానికే నిర్బంధ తనిఖీలు ' - sp vishnu warrior
ఆదిలాబాద్ జిల్లా మెుక్రా(బి) గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రజలు శాంతియుతంగా జీవించేందుకే సోదాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు.
'నేరాలను అదుపు చేయడానికే నిర్బంధ తనిఖీలు '