ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత నరేశ్ జాదవ్ ప్రకటించారు. ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు.
నామినేషన్ దాఖలు చేస్తా
By
Published : Mar 25, 2019, 7:20 AM IST
|
Updated : Mar 25, 2019, 10:07 AM IST
నామినేషన్ దాఖలు చేస్తా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన నరేశ్ జాదవ్ లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు. పార్టీలోని కొంతమంది తనకు టికెట్ రాకుండా
అడ్డుకున్నారని విమర్శించారు. ఆయా నేతల తీరుపై ప్రచారం చేస్తానని నరేశ్ జాదవ్ పేర్కొన్నారు.