కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఈ నెల 11న ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన రైతు ధర్నాను విజయవంతం చేయాలని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత కోరారు. జిల్లా ఇన్‌ఛార్జీ సాజిద్‌ఖాన్‌తో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు.
రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. 11న కాంగ్రెస్ ధర్నా
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 11న ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్ ఎదుట దీక్షను తలపెట్టారు. రైతులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. 11న కాంగ్రెస్ ధర్నా
నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సుజాత డిమాండ్ చేశారు. కేంద్రం అన్నదాతల పట్ల తమ మొండివైఖరిని మార్చుకోవాలని సూచించారు. రైతులకు మద్దతుగా నిర్వహించనున్న ఈ ధర్నాలో.. అన్నదాతలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఇదీ చదవండి:దిల్లీలో రైతుల ధర్నాకు మద్దతుగా.. నేలకొండపల్లిలో పాదయాత్ర