తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ స్వయం బలోపేతానికి ఎందుకు అనుమతివ్వరు?'

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే కేసీఆర్​ మెుండిగా వ్యవహరిస్తున్నారన్నారు.

'ఆర్టీసీ స్వయం బలోపేతానికి ఎందుకు అనుమతివ్వరు?'

By

Published : Oct 24, 2019, 5:52 PM IST

రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే కేసీఆర్‌ మొండిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదిలాబాద్‌లో ఇరవైరోజుల నుంచి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ మహిళా కార్మికులు చేస్తున్న దీక్షలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో జైళ్లశాఖ తనకున్న స్థలాల్లో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసుకొని... ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న తీరును వివరించిన జీవన్‌రెడ్డి... అదే విధానాన్ని ఆర్టీసీకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 60శాతం రాయితీగా ఇచ్చే ఎలక్ట్రికల్‌ బస్సులను... ప్రైవేటు వ్యక్తులతో కొనుగోళ్లు చేసి... అద్దెకు తీసుకొనే కంటే... ఆర్టీసీ ద్వారానే నేరుగా కొనుగోళు చేయిస్తే... ఫలితం ఉండదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుట్రపూరిత విధానంతోనే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్తోందని ధ్వజమెత్తారు.

'ఆర్టీసీ స్వయం బలోపేతానికి ఎందుకు అనుమతివ్వరు?'

ABOUT THE AUTHOR

...view details