తెలంగాణ

telangana

ETV Bharat / state

Adilabad Municipal Office: మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన భాజపా కార్యకర్తలు

Adilabad Municipal Office: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద భాజపా నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. బంగారిగూడ కాలనీ వాసులకు ఇంటి నెంబర్లు కేటాయించాలని వారు కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Leaders trying to get into a municipal office
మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేతలు

By

Published : Mar 21, 2022, 4:28 PM IST

Updated : Mar 21, 2022, 5:54 PM IST

Adilabad Municipal Office: ఆదిలాబాద్ పట్టణంలో భాజపా నేతలు మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. బంగారిగూడ కాలనీ వాసులకు ఇంటి నెంబర్లు కేటాయించాలని వారు నిరసన చేపట్టారు. తొలుత బంగారుగూడ వాసులంతా కలసి కార్యాలయం ఎదుట మూడు గంటల పాటు బైఠాయించారు. వారికి భాజపా నాయకులు మద్దతు తెలిపారు. కాలనీలో గత 18 సంవత్సరాల నుంచి నిరుపేదలు నివాసం ఉంటున్నప్పటికీ ఇంటి నెంబర్లు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు.

భాజపా నేతలు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. వారికి పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకు వినక పోవడంతో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. ఈ క్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ తనయుడు శరత్​ను పోలీస్ వాహనంలో తరలిస్తుండగా కార్యకర్తలు వాహన అద్దాలు పగలగొట్టారు. ఇది మరింత ఆందోళనకు కారణమైంది. ఆందోళనకారులను అరెస్ట్​ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

సమాచారం తెలుసుకున్న భాజపా అధ్యక్షుడు శంకర్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. లాఠీఛార్జీ చేసిన డీఎస్పీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌చేశారు. అదనపు ఎస్పీ వినోద్‌కుమార్‌ వచ్చి ఆయనకు సర్దిచెప్పారు. ఇంటి నెంబర్లు ఇచ్చేంతవరకు ఆందోళన ఆపమని శంకర్ స్పష్టంచేశారు.

ఇదీ చదవండి: Bandi Sanjay About Paddy Procurement : 'రైతులను మోసం చేసి కేంద్రంపై నెపం'

Last Updated : Mar 21, 2022, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details