ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన కరోనా వ్యాధి నివారణ, అప్రమత్తతకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు, పంచాయతీ కార్యదర్శులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి వ్యాధి పట్ల ప్రతి ఒక్కరిని అప్రమత్తం చెయ్యాలని సూచించారు.
కరోనాపై అధికారులకు కలెక్టర్ దేవసేన సూచనలు - ఆదిలాబాద్ జిల్లా
కరోనా వ్యాధి నివారణ చర్యలపై ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శ్రీదేవసేన అప్రమత్తం చేశారు. వైరస్‌పై ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కరోనాపై అధికారులకు కలెక్టర్ దేవసేన సూచనలు
ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పిప్పర్వాడ నుంచి ఆదిలాబాద్‌కు వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని పరీక్షించేందుకు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు.